విశాలాంధ్ర – కడియం : కడియం నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని కడియం సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కోరారు. కడియం మండలంలోని పలు అభివృద్ధి శంకుస్థాపనలకు విచ్చేసిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కడియపులంకలోని సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. అసోసియేషన్ అధ్యక్షులు బొర్సు సుబ్బారాయుడు మరియు పాలకవర్గ సభ్యులు వారికి మొక్కలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. నర్సరీ అసోసియేషన్ కు ప్రభుత్వ రాయితీపై జేసీబీ మంజూరు చేయించాలని, నర్సరీల కోసం ఎర్రమట్టిని తరలించే లారీలకు కొవ్వూరు టోల్ ప్లాజా సమీపంలోని బరువు కొలిచే కేంద్రం వద్ద వసూలు చేస్తున్న రుసుము నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ అసోసియేషన్ తరఫున వినతిపత్రాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలకు అందజేశారు. నర్సరీ రంగం అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుల్లా శ్రీను, కార్యదర్శి పాటంశెట్టి శ్రీనివాసరావు (వాసు), సంయుక్త కార్యదర్శులు బోడపాటి చంద్రశేఖర శ్రీనివాస్ (శేఖర్), అన్నందేవుల వెంకటేశ్వరరావు (బాబీ), ఉండమట్ల అర్జున్, సంయుక్త కోశాధికారులు గట్టా కృష్ణ భగవాన్, దూలం సత్యనారాయణమూర్తి, సమన్వయకర్త సాన రాజు, ప్రజా సంబంధాల అధికారి కామిశెట్టి వెంకటేష్, డైరెక్టర్ తడాల సత్యనారాయణ, కో-ఆప్షన్ సభ్యులు నూనె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
నర్సరీ రైతుల అభివృద్ధికి సహకరించండి
- Advertisement -
RELATED ARTICLES


