Homeసినిమాది ప్యారడైజ్‌ జోరు.. ప్రీమియర్లకు ముందే మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో నాని సినిమా

ది ప్యారడైజ్‌ జోరు.. ప్రీమియర్లకు ముందే మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో నాని సినిమా

- Advertisement -

నేచురల్‌ స్టార్‌ నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో మాత్రం ఈ చిత్రం దూసుకెళ్తోంది.
ముఖ్యంగా ఓవర్సీస్‌ మార్కెట్‌లో టికెట్‌ విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
ఉత్తర అమెరికాలో జోరు..
ఉత్తర అమెరికాలో ప్రీమియర్‌ షోల కోసం జరుగుతున్న అడ్వాన్స్‌ సేల్స్‌లో ‘ది ప్యారడైజ్‌’ఇప్పటికే 1.1మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటింది.
అంటే భారత కరెన్సీలో సుమారు రూ.10.52కోట్లకు పైమాటే. సినిమా ప్రీమియర్లు ప్రారంభం కాకముందే ఈ స్థాయిలో వసూళ్లు రావడం ట్రేడ్‌ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

దసరా కాంబినేషన్‌పై భారీ క్రేజ్‌..
ప్రీమియర్‌ షోలు పూర్తయ్యే సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఇంతటి ఆసక్తి ఏర్పడటానికి ప్రధాన కారణం వీరి గత చిత్రం దసరా. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.దీంతో అదే కాంబినేషన్‌లో రూపొందిన’ది ప్యారడైజ్‌’ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కొత్త కథ.. భిన్నమైన నేపథ్యం..

ఃదసరాఃతో పోలిస్తే ‘ది ప్యారడైజ్‌’ కథ, నేపథ్యం పూర్తిగా భిన్నంగా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.నాని కూడా తన కెరీర్‌లో ఇంతకుముందు చేయని తరహా పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

ఓపెనింగ్స్‌పై భారీ అంచనాలు..
శ్రీకాంత్‌ ఓదెల ఈసారి ఎలాంటి కథను, ఎలాంటి ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో కనిపిస్తున్న జోరు ఃది ప్యారడైజ్‌ఃకు భారీ ఓపెనింగ్స్‌పై అంచనాలను పెంచుతోంది.ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ప్రీమియర్లకు ముందే మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటడం సినిమాకు ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.అయితే అసలు పరీక్ష మాత్రం ప్రీమియర్‌ షోలు పూర్తయిన తర్వాతే మొదలుకానుంది.

మౌత్‌ టాక్‌ కీలకం..
సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన, మౌత్‌ టాక్‌ తదుపరి వసూళ్లను ప్రభావితం చేయనున్నాయి.ప్రస్తుతం అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో కనిపిస్తున్న జోరును సినిమా విడుదల తర్వాత కూడా కొనసాగించగలిగితే ఓవర్సీస్‌ మార్కెట్‌లో ఃది ప్యారడైజ్‌ః మరిన్ని రికార్డులను అందుకునే అవకాశం ఉంటుంది.మొత్తంగా విడుదలకు ముందే అడ్వాన్స్‌ సేల్స్‌తో’ది ప్యారడైజ్‌’ బాక్సాఫీస్‌ వర్గాల దృష్టిని ఆకర్షించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు