Homeజిల్లాలుతూర్పు గోదావరిసామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఆకస్మిక తనిఖీలు

సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఆకస్మిక తనిఖీలు

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని, ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ వసుంధర అన్నారు. కడియం మండల పరిధిలో ఉన్న సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మంగళవారం డాక్టర్ హారికతో కలిసి ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడియం సామాజిక ఆసుపత్రి లో ప్రస్తుతం ఉన్న క్షయ నిర్ధారణ ట్రునాట్ యంత్రంతో పాటుగా, ఎఐ సాంకేతికతతో పనిచేసే హ్యాండ్ హెల్డ్ ఎక్స్ రే యంత్రం కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కడియం, కడియపులంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని క్షేత్రస్థాయి సిబ్బంది ఎన్ సి డి సి డి సర్వే నిర్వహించాలని, ఈ సర్వేలో టిబి, లెప్రసీ, ఎత్తుకు తగ్గ బరువు లేనివారి వివరాలను పొందుపరచాలని అన్నారు. ఈ తనిఖీలలో స్థానిక వైద్యాధికారులు డాక్టర్ మణిజ్యోత్స్న, డాక్టర్ నాగసాయి మౌర్య, డిపిఎంఓ మల్లేశ్వర రావు, డాట్ ప్లస్ సూపర్ వైజర్ లక్ష్మి సుందరి, టిబి సూపర్ వైజర్ జి శేషు, స్థానిక సిబ్బంది సిహెచ్ విల్సన్ పాల్, మురళి కృష్ణ, నరసింహ మూర్తి, శ్రీనివాస్, ఎఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు