Homeజిల్లాలుతూర్పు గోదావరిఎడతెరిపి లేని వర్షం...గ్రామంలో చేరిన కొండవాగుల వరద నీరు..

ఎడతెరిపి లేని వర్షం…గ్రామంలో చేరిన కొండవాగుల వరద నీరు..

- Advertisement -

నివాస గృహాలకు వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు

కొండవాగుల నీరు రాకుండా అడ్డుకట్టు వేయాలని గ్రామస్తుల ఆవేదన..

విశాలాంధ్ర- డుంబ్రిగుడ : ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గెడ్డ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండల కేంద్రంలోని కొండవాగుల వరద నీరు గెడ్డా వాగుల ఉప్పొంగి గ్రామంలో ప్రవహించి నేరుగా నివాసగృహాలలో వరద నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రామస్తులు లెక్కచేయకుండా వర్షంలో తడుస్తూ ఆయా నివాస గృహాలలో వరద నీరు చేరుతుండడంతో వరద నీరును అడ్డుకట్టు వేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయినా సరే భారీ వర్షం కురుస్తుండడం వల్ల కొండ చర్యాల నుంచి అతివేగంగా వరద నీరు గ్రామంలో చొచ్చుకు రావడం వల్ల గ్రామమంతా వరద నీరు నిండిపోయింది. దీంతో ఆయా నివాస గృహాలలో వరద నీరు రావడంతో నివాస గృహాలదారులు వరద నీరు తోడేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. నివాస గృహాలలో వరద నీరు చేరడం వల్ల కూర్చునే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామం అంత వరద నీరు ప్రవహించడం వల్ల గ్రామస్తులంతా ఏ సమయంలో ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రతి ఏటా అతి భారీ వర్షాలు కురిసినప్పుడు గ్రామంలో ఇలాగే గెడ్డ వాగుల వరద నీరు నేరుగా గ్రామంలో ప్రవహిస్తుండడం వల్ల ప్రతిఏటా ఇలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు చొరవ తీసుకొని కొండ వాగుల నుంచి వచ్చే వరద నీరు గ్రామంలో రాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు