Homeఅంతర్జాతీయం'మీ మోసం అందరికీ తెలుసు'.. ఐరాస వేదికగా పాక్‌కు భారత్‌ గట్టి వార్నింగ్

‘మీ మోసం అందరికీ తెలుసు’.. ఐరాస వేదికగా పాక్‌కు భారత్‌ గట్టి వార్నింగ్

- Advertisement -

ఐక్యరాజ్య సమితి (ఐరాస) వేదికగా దాయాది పాకిస్థాన్‌కు భారత్‌ గట్టి హెచ్చరికలు చేసింది.సీమాంతర ఉగ్రవాదాన్ని ఇలాగే ప్రోత్సహిస్తూ కొనసాగిస్తే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.జమ్మూకశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని మరోసారి పునరుద్ఘాటించింది. ఐరాస వంటి అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ చేస్తోన్న అబద్ధపు ప్రచారాన్ని ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే ఉన్నాయని భారత్‌ పేర్కొంది.
ఆ దేశం చేపడుతున్న ఉగ్రవాద చర్యలు, మోసపూరిత వైఖరి అందరికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయని తెలిపింది.

జమ్మూకశ్మీర్‌ విషయంలోనూ ఎలాంటి మార్పు లేదు
యూఎన్‌లో భారత శాశ్వత మిషన్‌ ఫస్ట్‌ సెక్రటరీ పెటల్‌ గహ్లోత్‌ ఈ మేరకు పాకిస్థాన్‌ తీరుపై స్పందించారు. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తన ప్రసంగంలో సింధూ జలాల ఒప్పందం అంశాన్ని ప్రస్తావించారు. దీనికి ప్రతిస్పందనగా భారత్‌ ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు ఈ విధంగా కౌంటర్‌ ఇచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. మరోవైపు అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై ఆరోపణలు చేయడం పాకిస్థాన్‌ వైఖరిలో భాగమని భారత్‌ పేర్కొంది. జమ్మూకశ్మీర్‌ విషయంలోనూ ఎలాంటి మార్పు లేదని.. అది ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు