Homeతెలంగాణగణేశ్ నిమజ్జనం సక్సెస్.. పోలీసులతో కలిసి డ్యాన్స్ చేసిన సీపీ సజ్జనార్

గణేశ్ నిమజ్జనం సక్సెస్.. పోలీసులతో కలిసి డ్యాన్స్ చేసిన సీపీ సజ్జనార్

- Advertisement -

హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును విజయవంతంగా నిర్వహించడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన సిబ్బందితో కలిసి సంబరాలు జరుపుకున్నారు.నిమజ్జన ప్రక్రియ ముగిసిన అనంతరం, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద పోలీసు సిబ్బందితో కలిసి సీపీ సజ్జనార్ నృత్యం చేశారు. ఃది ప్యారడైజ్ః చిత్రంలోని ఃఆయా షేర్ః పాటకు ఆయన చిందులేశారు. గత కొన్ని రోజులుగా విధుల్లో నిమగ్నమై అప్రమత్తంగా ఉన్న పోలీసులు, నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉన్నతాధికారి స్వయంగా వారితో కలవడంతో సిబ్బందిలో ఉత్సాహం రెట్టింపైంది.మరోవైపు, నగరంలో నిమజ్జన క్రతువు ముగియడంతో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను ఎత్తివేశారు. సచివాలయం పరిసర ప్రాంతాలైన ట్యాంక్‌బండ్, లిబర్టీ, అసెంబ్లీ మార్గాల్లో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు