Homeతెలంగాణతెలంగాణలో టెట్‌ ఫలితాలు విడుదల.. 70.07 శాతం ఉత్తీర్ణత

తెలంగాణలో టెట్‌ ఫలితాలు విడుదల.. 70.07 శాతం ఉత్తీర్ణత

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీజీటెట్‌-ఇన్‌సర్వీస్‌ టీచర్స్‌-2026 ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, టీజీటెట్‌ ఛైర్‌పర్సన్‌ శనివారం ఫలితాలను విడుదల చేశారు. జులై 21న విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించారు. మూడు విడతల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగాయి. మొత్తం 24,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15,749 మంది అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 70.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పేపర్‌-1లో 4,942 మంది పరీక్షకు హాజరుకాగా.. 3,398 మంది (68.76%) అర్హత సాధించారు. పేపర్‌-2 గణితం, సైన్స్‌ విభాగంలో 9,131 మంది పరీక్ష రాశారు. వీరిలో 6,720 మంది (73.60%) ఉత్తీర్ణులయ్యారు. పేపర్‌-2 సోషల్‌ స్టడీస్‌లో 8,404 మంది పరీక్షకు హాజరుకాగా.. 5,631 మంది (67%) అర్హత సాధించారు. అభ్యర్థులు తమ ఫలితాలతో పాటు మార్కుల వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సమీపంలోని మీ-సేవ కేంద్రాల్లోనూ మార్కుల వివరాలను పొందవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు