Homeజిల్లాలుఅనంతపురంపదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవే నా ధ్యేయం: జెడ్పీటీసీ పసుపుల హేమావతి ఆదినారాయణ

పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవే నా ధ్యేయం: జెడ్పీటీసీ పసుపుల హేమావతి ఆదినారాయణ

- Advertisement -

​విశాలాంధ్ర – రాప్తాడు : రాప్తాడు మండల జిల్లా పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గ (జడ్పీటీసీ) సభ్యురాలిగా పసుపుల హేమావతి ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పసుపుల హేమావతి మాట్లాడుతూ… తనకు ఈ ఉన్నతమైన అవకాశాన్ని కల్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, తన గెలుపునకు నిరంతరం సహకరించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
​అలాగే తనకు నిరంతరం తోడుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, తనను ఆదరించి గెలిపించిన రాప్తాడు మండల ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పదవి అనేది కేవలం ప్రజలకు సేవ చేయడానికి దక్కిన బాధ్యత మాత్రమేనని, పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజలకు దూరం కాబోనని మాజీ జెడ్పిటిసి హేమావతి పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఎల్లప్పుడూ మండల ప్రజల మధ్యనే ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తన పదవీకాలంలో పూర్తి స్థాయిలో సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు