Homeజిల్లాలుఅనంతపురంబొందలవాడలో ఉలవల పంపిణీ కార్యక్రమం...

బొందలవాడలో ఉలవల పంపిణీ కార్యక్రమం…

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల: మండల పరిధిలోని బొందలవాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసా నాయుడు లబ్ధిదారులకు ఉలవలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉలవలు పశుసంవర్ధక మరియు వ్యవసాయ రంగాలకు ఎంతో ఉపయోగకరమైనవని తెలిపారు. పశువుల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉలవల్లో సమృద్ధిగా ఉంటాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణను ప్రోత్సహించడంలో ఇటువంటి పంపిణీ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకొని ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, లబ్ధిదారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు