Homeజిల్లాలుఅనంతపురంబాధితులకు అడగగానే అండగా నిలిచే నాయకత్వం

బాధితులకు అడగగానే అండగా నిలిచే నాయకత్వం

- Advertisement -

​-టీడీపీ నాయకుడు బాషా

విశాలాంధ్ర-రాప్తాడు : ప్రజల కష్టాలను, అవసరాలను గుర్తించి అడిగిన వెంటనే స్పందించి అండగా నిలిచే నాయకత్వం మనకు ఉందని రాప్తాడు మండల చిన్మయనగర్ నివాసి లబ్ధిదారుడు బాషా కొనియాడారు. ​రాప్తాడు పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను కలిసి తన పరిస్థితిని, దివ్యాంగుడుగా ఉన్న తనకు మోటార్ సైకిల్ అవసరాన్ని వివరించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత వెంటనే స్పందించారు. బాషా అవసరాన్ని అర్థం చేసుకుని, ఆయనకు తక్షణమే మోటార్ సైకిల్‌ను తెప్పించగా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి, రాప్తాడు మండల ఇన్‌చార్జ్ ధర్మవరపు మురళి, టిడిపి మండల కన్వీనర్ పంపు కొండప్ప సోమవారం అందజేశారు. ​ఈ సందర్భంగా లబ్ధిదారుడు బాషా మాట్లాడుతూ… “నా అవసరాన్ని అర్థం చేసుకుని, అడిగిన వెంటనే స్పందించి మోటార్ సైకిల్ అందించిన టీడీపీ నాయకత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని భావోద్వేగంతో తెలిపారు. ప్రజల సమస్యల పట్ల త్వరితగతిన స్పందించే ఇటువంటి నాయకత్వం ఉండటం ఎంతో అభినందనీయమని స్థానికులు కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు