Homeజిల్లాలుఅనంతపురంపి జి ఆర్ ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోగా చట్ట పరిధిలో పరిష్కరించాలి

పి జి ఆర్ ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోగా చట్ట పరిధిలో పరిష్కరించాలి

- Advertisement -

-జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ​జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్’ (పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి 98 వినతులను ఎస్పీ నేరుగా స్వీకరించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, ప్రతి అర్జీని చట్టపరిధిలో సమగ్రంగా విచారించాలని అధికారులను ఆదేశించారు. ​బాధితులకు వేగంగా, పారదర్శకంగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా కుటుంబ కలహాల ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ​ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ఎం.నాగభూషణం, మహిళా విభాగం డీఎస్పీ శివప్రసాద్ , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు