Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిశిష్ట పోలీసు సేవలకు రిటైర్డ్ డీఎస్పీ శ్రీ శశమ రామకాంత్‌కు స్వర్ణ నంది పురస్కారం

విశిష్ట పోలీసు సేవలకు రిటైర్డ్ డీఎస్పీ శ్రీ శశమ రామకాంత్‌కు స్వర్ణ నంది పురస్కారం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;;పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశమ రామకాంత్‌కు 2026 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక “స్వర్ణ నంది అవార్డు” లభించింది.పోలీస్ సేవల్లో ఆయన అందించిన అసాధారణ సేవలు, కర్తవ్యనిష్ఠ, గ్యాలంట్రీ (వీరత్వం), మానవతా దృక్పథంతో చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జరిగిన మెగా ఈవెంట్‌లో ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. రిటైర్డ్ డీఎస్పీగా శ్రీ రామకాంత్ అందించిన సేవలను గుర్తించి, పోలీసు సేవల్లో ఆయన చేసిన కృషికి గౌరవంగా ఈ పురస్కారం అందజేయడం పట్ల పలువురు పోలీసు అధికారులు, సహచరులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. స్వర్ణ నంది అవార్డు అందుకోవడం ద్వారా పోలీసు సేవల్లో ఆయన చేసిన కృషికి మరోసారి గుర్తింపు లభించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు