విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కళాజ్యోతి లో శతవార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మారం పట్టణానికి చెందినటువంటి మానస నృత్య కళా కేంద్రం వారి బృందం చే ప్రత్యేక కూచిపూడి నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి. ఈ నృత్య ప్రదర్శనలో భాను,మైత్రి, సంధ్య శ్రీ, కావ్య శ్రీ, శాన్వి స్వరూప్, రిత్విక, భావన, మేఘ సాయి, కూచిపూడి నాట్యం చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం గురువు మానసను ప్రముఖ అతిధులు గజల్ శ్రీనివాస్, ధర్మవరం డిఎస్పి చేతులమీదుగా ఎంతో గౌరవంతో వారిని సత్కరించారు. అనంతరం శిష్య బృందం కు కూడా మెమొంటోలను అందజేయడం జరిగింది. గురువు మానస మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది అని తెలుపుతూ కళాజ్యోతి కార్యవర్గానికి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆకట్టుకున్న మానస నాట్య ప్రదర్శన
- Advertisement -
RELATED ARTICLES


