Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరూ.17 కోట్ల ఎల్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల పనులు పునఃప్రారంభం...

రూ.17 కోట్ల ఎల్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల పనులు పునఃప్రారంభం…

- Advertisement -

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;;అమృత్‌-1 పథకం కింద ధర్మవరం పట్టణంలో చేపట్టిన తాగునీటి మౌలిక వసతుల అభివృద్ధి పనులకు మళ్లీ కదలిక వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ చొరవతో పునఃప్రారంభించారు. అమృత్‌-1 పథకం కింద సుమారు రూ.17 కోట్ల వ్యయంతో ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట పంప్‌హౌస్, సిద్ధయ్యగుట్ట, ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో ఎల్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల నిర్మాణంతో పాటు వాటికి అనుసంధానంగా పైప్‌లైన్‌ పనులను చేపట్టారు. అయితే వివిధ కారణాలతో ఈ పనులు కొంతకాలంగా నిలిచిపోయాయి. పట్టణ ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా అందించాలనే లక్ష్యంతో మంత్రి సత్యకుమార్ యాదవ్ సంబంధిత అధికారులతో సమీక్షించి, నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేలా చొరవ తీసుకున్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఆయన నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు సోమవారం మున్సిపల్ డి.ఈ. వీరేష్‌తో కలిసి ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట పంప్‌హౌస్ వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల నిర్మాణంతో పాటు సంబంధిత పైప్‌లైన్‌ పనులను సమన్వయంతో చేపట్టి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ధర్మవరం పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు