విశాలాంధ్ర ధర్మవరం;;పట్టణ ప్రజలకు అందుతున్న ప్రాథమిక వైద్య సేవలు, ఆసుపత్రిలోని సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు హరీష్ బాబు సోమవారం ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్‌లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి, వైద్యం కోసం వచ్చిన ప్రజలను నేరుగా అడిగి వారి అనుభవాలను తెలుసుకున్నారు. వైద్య సేవలు, మందుల లభ్యత, పరీక్షలు, ఇతర సౌకర్యాలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆసుపత్రిలోని ఫార్మసీ డిస్పెన్సరీ, ల్యాబొరేటరీ, డ్రెస్సింగ్ మరియు అత్యవసర చికిత్స గది, ఓపీ రిజిస్ట్రేషన్ విభాగం, మైనర్ ఆపరేషన్ థియేటర్‌లను హరీష్ బాబు పరిశీలించారు. ఆయా విభాగాల్లో అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, రోగులకు కల్పిస్తున్న ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్యం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. అవసరమైన సౌకర్యాలు, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హరీష్ బాబు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో నిరంతరం పరిశీలిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచనల మేరకు చర్యలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో వైద్య సేవల వైద్య సేవలను పరిశీలించిన మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్
- Advertisement -
RELATED ARTICLES


