స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై వివాదం కొనసాగుతున్న వేళ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
SIR ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాల్లో కొత్త ఓటరు నమోదు కోసం ఉపయోగించే Form-6 నుంచి అదనపు SIR డిక్లరేషన్‌ను తొలగించింది.
దీంతో ఆయా రాష్ట్రాల్లో కొత్త ఓటర్లు Form-6 ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలో Annexure-D సమర్పించాల్సిన అవసరం ఉండదు.
ఈ మార్పు సెప్టెంబర్ 30, 2026న ECINET పోర్టల్‌లో అమల్లోకి వచ్చినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
అసలు వివాదం ఎలా మొదలైంది?
అయితే SIR ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాల్లో మాత్రం ఈ అదనపు డిక్లరేషన్ నిబంధన కొనసాగుతోంది. అంటే అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి Annexure-Dను పూర్తిగా తొలగించినట్లు కాదు. SIR పూర్తయిన ప్రాంతాల్లో పాత విధానాన్ని పునరుద్ధరించగా.. SIR జరుగుతున్న రాష్ట్రాల్లో సంబంధిత నిబంధనలు అమల్లో ఉంటాయి. ఓటర్ల జాబితాను మరింత సమగ్రంగా పరిశీలించేందుకు చేపట్టిన SIR ప్రక్రియలో భాగంగా Form-6తో పాటు అదనపు డిక్లరేషన్‌ను తీసుకొచ్చారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే దరఖాస్తుదారులు తమకు లేదా తల్లిదండ్రులు, తాతముత్తాతలకు సంబంధించిన గత ఓటర్ల జాబితా వివరాలను ఈ డిక్లరేషన్‌లో వెల్లడించాల్సి వచ్చేది.
ఎన్నికల సంఘం వివరణ ప్రకారం.. Form-6 అసలు చట్టబద్ధమైన రూపంలో ఎలాంటి మార్పు చేయలేదని, SIRకు సంబంధించిన అదనపు వివరాలను ప్రత్యేక డిక్లరేషన్‌గా జత చేశామని గతంలో స్పష్టం చేసింది. 2025 జూన్ 24న జారీ చేసిన SIR సూచనల్లో కొత్త ఓటరు నమోదు సమయంలో Form-6/Form-8తో పాటు Annexure-D సమర్పించాలని పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి. అయితే ఈ అదనపు నిబంధనపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు పొందుతున్న యువతకు పాత ఓటర్ల జాబితాల్లో తమ కుటుంబ సభ్యుల వివరాలను గుర్తించడం కష్టంగా మారిందనే ఆందోళనలు వచ్చాయి.
పాత ఓటరు వివరాలు ఎందుకు అవసరమయ్యాయి?
SIRకు సంబంధించిన Form-6 ప్రక్రియలో దరఖాస్తుదారులు గత ఓటర్ల జాబితాల్లో తమ పేరు లేదా తల్లిదండ్రులు,తాతముత్తాతల పేర్లు ఉన్నాయా అనే వివరాలను వెల్లడించాల్సి వచ్చేది. గతంలో ఉన్న నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ స్టేషన్ లేదా బూత్ నంబర్,పాత సీరియల్ నంబర్ వంటి వివరాలను కూడా అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాంకేతికంగా కొన్ని వివరాలను ఐచ్ఛికంగా పేర్కొన్నప్పటికీ..ECINETలో వాటిని నమోదు చేయకపోతే దరఖాస్తు ముందుకు వెళ్లడం లేదని విమర్శలు వచ్చాయి. దీంతో ముఖ్యంగా 2000ల తర్వాత పుట్టిన 18ఏళ్ల యువతకు,తొలిసారి ఓటరుగా నమోదు చేసుకునేవారికి పాత రికార్డులు వెతకడం ఇబ్బందిగా మారింది. ఈ అంశంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
ఇక పాత విధానంలో కొత్త ఓటరు నమోదు ఎలా ఉంటుంది?
గతంలో ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిపోయి, మళ్లీ నమోదు చేసుకోవాలనుకునే వారికి కూడా పాత కుటుంబ రికార్డుల ఆధారంగా వివరాలు సమర్పించడం అదనపు ప్రక్రియగా మారింది. SIR ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాల్లో ఇప్పుడు అదనపు SIR డిక్లరేషన్ తొలగించడంతో కొత్త ఓటర్లు సాధారణ Form-6 ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. Form-6 అనేది కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రాథమిక దరఖాస్తు.ఇందులో పేరు, బంధువు వివరాలు, వయస్సు, చిరునామా, ఇతర అవసరమైన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దీంతో SIR పూర్తయిన రాష్ట్రాల్లో కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారికి తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పాత ఓటింగ్ రికార్డులను అదనంగా మ్యాప్ చేయాల్సిన SIR-ఆధారిత ప్రక్రియ ఉండదు.
అదనపు డిక్లరేషన్ ఎందుకు తీసుకొచ్చారు?
సాధారణ Form-6 ఆధారంగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓటర్ల జాబితాలో అక్రమ నమోదులను గుర్తించడం, అర్హత లేని వ్యక్తుల పేర్లను నిరోధించడం, పాత ఓటరు జాబితాలతో ప్రస్తుత వివరాలను అనుసంధానం చేయడం SIR ప్రక్రియలో భాగమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అదనపు డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. అయితే Form-6కు సంబంధించిన ఈ అదనపు నిబంధనపై ఎన్నికల సంఘం అంతర్గతంగానూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చట్టబద్ధమైన Form-6లో మార్పులు లేదా అదనపు తప్పనిసరి అంశాలను చేర్చే విషయంలో చట్టపరమైన అనుమతులు అవసరమని సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి అభిప్రాయపడ్డట్లు నివేదికలు పేర్కొన్నాయి.
అదనపు డిక్లరేషన్ ఎందుకు తీసుకొచ్చారు?
ఈ వివాదాల నేపథ్యంలో SIR పూర్తయిన రాష్ట్రాల్లో అదనపు డిక్లరేషన్‌ను తొలగించాలని ఈసీ నిర్ణయించింది. దీంతో అక్కడ Form-6 ఆధారంగా కొత్త ఓటరు నమోదు ప్రక్రియ మళ్లీ సరళీకృతమైంది. అయితే SIR ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రాల్లో మాత్రం సంబంధిత అదనపు డిక్లరేషన్ నిబంధన అమల్లోనే ఉంటుంది.


