మల్కాజిగిరి`మౌలాలి సర్కిల్ చెత్తకే పరిమితం కావాల్సిన యార్డుకు ఇతర ప్రాంతాల నుంచి వ్యర్థాలు?
విశాలాంధ్ర, హైదరాబాద్ : మౌలాలి సర్కిల్ నేరేడ్మెట్ డంపింగ్ యార్డు తొలగించాలని చుట్టు ప్రక్కల కాలనీవాసులు అధికారులను కోరుతున్నారు. మద్యాహ్నం రెండు గంటల వరకు జరగాల్సిన కార్యకలాపాలు 24 గంటలు జరగుతున్నాయని, స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో కాలనీవాసలకు తీవ్ర ఇబ్బంది నెలకొంటుందిని ఈ యార్డును వెంటనే తొలగించాలనే ప్రతిపాదన పెరుగుతోంది. బుధవారం ఉదయం కాలనీ వాసులు, యార్డు కార్మికులు బయటి వాహనాలు రావద్దని నిరసన చేపట్టారు. నేరేడ్మెట్ ప్రాంతంలోని చెత్త డంపింగ్లో వ్యాపార కార్యక్రమాలు జరగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మల్కాజిగిరి, మౌలాలి సర్కిల్ పరిధిలోని చెత్తను రెండు సర్కిళ్ళకు సంబంధించిన స్వచ్చ ఆటోలు, ఈ సర్కిళ్ళకు చెందిన ప్రభుత్వ వాహానాలు, ఈ రెండు సర్కిళ్ళతో అగ్రిమెంట్ అయిన రాంకీ వాహనాలు మాత్రమే ఈ డంపింగ్ యార్డుకు రావాల్సి ఉంటుంది. కానీ మల్కాజిగిరి, మౌలాలి చుట్టు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున చెత్త వాహనాలు వస్తుండడంతో ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు కాలనీవాసులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను ఏ రోజుకు ఆరోజు తొలగించాల్సిన ఉన్నప్పటికి కింద చెత్తను డంపు చేస్తున్నారు. ఉదయం 6గంటల నుండి మద్యాహ్నం 2 గంటల వరకు డంపింగ్ కార్యకలాపాలు ముగించాల్సి ఉండగా ఇక్క రాంకీకి చెందిన వ్యక్తులు వ్యాపారదోరణితో ప్రైవేటు వాహనాల ద్వారా మట్టి, చెత్తను రాత్రి వేళల్లో తీసుకువస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై దృష్టి సారించాల్సిన ఉన్నతాధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడంతో రాంకి సిబ్బంది ఆజమాయిషి ఇక్కడ కొనసాగుతోందని, రాంకీ సిబ్బంది వారి వాహనాలలో చెత్తను ఎత్తి పంచాల్సిన ఉంటుందని, యార్డుకు రావాల్సిన అవసరమే వారికి లేదని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు. ఇతర సర్కిళ్ళకు చెందిన వాహనాలు వచ్చి ఇక్కడ డంప్ చేయడం వల్ల దుర్గందం ఎక్కవైన కాలనీ వాసులు ఈ యార్డును మÖసివేయాలని ఆందోళన చేస్తున్నారని కార్మికులు పేర్కొంటున్నారు.
‘రామ్కీ’ ఆధిపత్యం పెరిగిందా?
డంపింగ్ యార్డు నిర్వహణలో సంబంధిత సంస్థ సిబ్బంది, వాహనాల రాకపోకలు, చెత్త తరలింపు వ్యవహారంపై సమగ్ర పర్యవేక్షణ అవసరమని స్థానికులు అంటున్నారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇక్కడ ప్రైవేట్ నిర్వహణ సంస్థ రామ్కీ సిబ్బంది ఆధిపత్యం పెరిగిపోయిందని తెలుస్తుంది. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు, రామ్కీ సంస్థ ప్రతినిధుల అధికారిక వివరణ తెలియాల్సి ఉంది. ఇతర సర్కిళ్ల నుంచి చెత్తను తరలించేందుకు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ నిబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. డంపింగ్ యార్డులో కార్యకలాపాలు నిర్ణీత సమయాల్లోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పరిసర కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ట్రక్కులు, ఇతర చెత్త వాహనాల రాకపోకలతో శబ్ద కాలుష్యం, దుమ్ము, దుర్వాసన వంటి సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రాత్రివేళల్లో కూడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయా? అనుమతించిన సమయాలకు మించి వాహనాల రాకపోకలు జరుగుతున్నాయా? అనే అంశాలపై అధికారులు తనిఖీ చేయాలని వారు కోరుతున్నారు.
ఈ సమస్యల వల్ల యార్డు ఎత్తివేయాలని పలుమార్లు వినతులు…
డంపింగ్ యార్డు 24 వాహనాల రాకపోకలతో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరిసర కాలనీ వాసులు ఈ డంపింగ్ యార్డును ఎత్తివేయాలని పలు మార్లు అధికారులకు వినతి పత్రాన్ని అందజేసినట్లు సప్తగిరి కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. యార్డును అక్కడి నుంచి తరలించాలని, ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి చెత్త డంపింగ్ కొనసాగితే తమ నివాస ప్రాంతాలపై దాని ప్రభావం మరింత పెరుగుతుందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జనావాసాలకు సమీపంలో చెత్త నిల్వ, తరలింపు, వాహనాల రాకపోకలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం, పర్యావరణ అంశాలపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
అధికారుల తనిఖీలు ఎక్కడ?…
డంపింగ్ యార్డుకు వచ్చే ప్రతి వాహనం ఏ సర్కిల్ నుంచి వస్తోంది? ఎంత పరిమాణంలో చెత్త తీసుకొస్తోంది? నిర్దేశిత ప్రాంతానికి చెందిన చెత్తే డంప్ చేస్తున్నారా? నిర్ణీత సమయాల్లోనే కార్యకలాపాలు జరుగుతున్నాయా? వంటి అంశాలను అధికారులు క్రమం తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉంది. స్థానికుల ఆరోపణలపై అధికారిక విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుంచి చెత్తను డంపింగ్ చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే యార్డు నిర్వహణ, వాహనాల రాకపోకలు, పని వేళలు, పర్యావరణ నిబంధనల అమలుపై స్పష్టమైన సమాచారాన్ని అధికారులు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
జవహర్ నగర్ వద్ద చెత్త వాహనాలు గంటల తరబడి వేచి ఉండాల్సిందే…
జవహర్ నగర్ డంపింగ్డ్ యార్ వద్ద ప్రభుత్వ వాహనాలు ,(జిహెచ్ఎంసి ఎంఎంసీ)కి సంబంధించిన చెత్త వాహనాలు కిలోమీటర్ల క్యూలో ఉన్నప్పటికీ రాంకీ బండ్లు మాత్రం వీటిని పక్కనపెట్టి వెళ్ళుతూ చెత్తను తప్ప చేస్తూ వెళుచే వెళ్తుంటాయని పలువురు పేర్కొంటున్నారు. రాంకీ వాహనాలకు మాత్రం క్యూ వర్తించకపోవడంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.


