Homeజాతీయంకెప్టెన్ మచ్చర్‌ ఓ హీరో.. త్వరగా కోలుకోవాలి: మోదీ

కెప్టెన్ మచ్చర్‌ ఓ హీరో.. త్వరగా కోలుకోవాలి: మోదీ

- Advertisement -

ప్రాణాంతక దాడి జరిగినా.. తన గురించి ఆలోచించకుండా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేశారు భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌. తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రాణాలను కాపాడారు. ఆయన ధైర్యసాహసాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆయనను ‘హీరో’గా అభివర్ణిస్తూ.. .. దేశం మొత్తం స్మిత్‌ను చూసి గర్విస్తోందని పేర్కొన్నారు.‘‘అనుకోకుండా ప్రమాదం ఎదురైన సమయంలో, తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు కెప్టెన్ స్మిత్ మచ్చర్ గొప్ప ధైర్యసాహసాలను ప్రదర్శించారు. ఆయన తెగువ ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంతో పాటు.. పెను విషాదాన్ని అడ్డుకుంది. మచ్చర్‌ను చూసి భారత్‌ గర్విస్తోంది. ఆయన వేగంగా కోలుకుని, మరింత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను్ణ్ణ అని మోదీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

స్థిరంగా కెప్టెన్‌ ఆరోగ్యం..
ఘటనలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రియాద్‌, జెడ్డాలోని భారత అధికారులు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆయన పరిస్థితి ప్రమాదకరంగా లేనట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

మచ్చర్‌ సమయస్ఫూర్తి ప్రశంసనీయం: ట్రంప్‌
స్మిత్‌ మచ్చర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. అతడిని హీరోగా అభివర్ణించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో ఈ ఘటనపై మాట్లాడినట్లు ట్రంప్‌ తెలిపారు. స్మిత్‌ తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్‌ తలుపు తెరిచి సహాయం కోసం కేకలు వేయడం వల్ల ప్రయాణికులు లోపలికి వెళ్లే అవకాశం లభించిందని ట్రంప్‌ వివరించారు. నిపైలట్‌ త్వరగా కోలుకోవాలి. ఆయన అంత తీవ్రమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ తలుపు తెరిచిన ఆయనకు సమయస్ఫూర్తి ప్రశంసనీయం.. ఒక రకంగా చెప్పాలంటే ఆయన హీరో. దాడి చేసిన కో పైలట్‌ బహుశా ఉగ్రవాది లేదా మతిస్థిమితం లేనివాడై ఉంటాడు. అందుకే ఇంత దారుణంగా కత్తితో దాడి చేశాడు” అని ట్రంప్‌ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు