Homeఅంతర్జాతీయం'ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిల కోసమే'.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్

‘ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిల కోసమే’.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్

- Advertisement -

టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత, ఎక్స్ (గతంలో ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిల కోసం అంటూ ఆయన చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది.వివరాల్లోకి వెళితే, గైగర్ క్యాపిటల్ అనే ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ అక్టోబర్ 1న ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఒక పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఒక మహిళా యాప్ అని పేర్కొంటూ, దాన్ని తన ఫోన్ నుంచి తొలగించినట్లు తెలిపారు. దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ, ఁఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిల కోసమేఁ అని రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.అయితే, మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో కూడా ఆయన ఇదే తరహాలో కామెంట్ చేసి వివాదానికి కారణమయ్యారు. అప్పట్లో,”కొంతమంది మగవాళ్లు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ పంపినప్పుడు, మీరు లింగమార్పిడి చేసుకుంటున్నారా ఏంటి? అని అడగాలనిపిస్తుంది” అని కూడా వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు.

మస్క్ తాజా వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని హాస్యంగా తీసుకుంటుండగా, మరికొందరు జెండర్ స్టీరియోటైప్స్‌ను (లింగ పక్షపాతాన్ని) ప్రోత్సహించేలా ఉందని విమర్శిస్తున్నారు. వ్యాపారవేత్తలు, కళాకారులు, జర్నలిస్టులు ఇలా అన్ని వర్గాల వారు వాడుతున్న వేదికను ఇలా వర్గీకరించడం సరికాదని అంటున్నారు. ఎక్స్‌కు పోటీగా మెటా సంస్థ ఃథ్రెడ్స్ఃను ప్రారంభించినప్పటి నుంచి ఈ రెండు సంస్థల మధ్య పోటీ తీవ్రమైన విషయం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు