విశాలాంధ్ర-గూడూరు: మండలంలోని కే.నాగలాపురం, జూలకల్లు గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు. పీఆర్‌డీఈ కర్రిన్న ఆధ్వర్యంలో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, టీడీపీ మండల కన్వీనర్ జక్కపోగు సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్లె పండుగ నిధుల్లో భాగంగా గూడూరు మండలానికి రూ.1.90 కోట్లు మంజూరు చేసిందన్నారు. కే. నాగలాపురం గ్రామంలో రూ.11 లక్షలు, జూలకల్లు గ్రామంలో రూ.51 లక్షలతో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టి, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత గుత్తిదారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణ శర్మ, ఏపీవో హసీనా, సుంకుల పరమేశ్వరి ఆలయ కమిటీ వైస్ చైర్మన్ గోపాల్ రెడ్డి, కురువ సంఘం రాష్ట్ర డైరెక్టర్ వెంకటరాముడు, పెంచికలపాడు ఎంపీటీసీ మద్దిలేటి,టీడీపీ నాయకులు కర్ణం గిడ్డయ్య, కర్ణం యుగంధర్, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పల్లె పండుగ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
- Advertisement -
RELATED ARTICLES


