Homeజిల్లాలుఅనంతపురంవృద్ధాప్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

వృద్ధాప్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో వృద్ధుల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్.ఎం.డి. షఫీ, సీహెచ్‌ఓ నాగరంగయ్య పాల్గొని వృద్ధులకు ఆరోగ్య సూచనలు అందించారు. అక్టోబర్ నెల మొత్తం వృద్ధుల ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. వృద్ధాప్యంలో మతిమరుపు, కీళ్ల వాపులు, ఆయాసం, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, కంటి, వినికిడి సమస్యలు, మధుమేహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు తదితర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వృద్ధులు వైద్యుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సొంత వైద్యం చేయకుండా వైద్యుల సూచన మేరకే మందులు వాడాలని తెలిపారు. చురుకుగా ఉండేందుకు తగిన శారీరక శ్రమ చేయడంతో పాటు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు