విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు బాపూలే బాలికల గురుకుల పాఠశాల చైర్‌పర్సన్‌గా పోతుల హేమలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకోవడంతో హేమలత హర్షం వ్యక్తం చేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో తన భర్త పోతుల రవికుమార్ ఇదే పాఠశాల చైర్మన్‌గా సేవలందించి పాఠశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఆ సేవా స్ఫూర్తితో తాను కూడా పాఠశాల పురోగతికి అంకితభావంతో పనిచేస్తానన్నారు.తన ఎన్నికకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసనాయుడు, జిల్లా నాయకుడు ఆలం వెంకట్ నాయుడు తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


