Homeజిల్లాలుఅనంతపురంప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురములో ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు – సి పి ఆర్...

ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురములో ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు – సి పి ఆర్ పై ప్రజలకు అవగాహన

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ అనస్థీషియా దినోత్సవాన్ని 1846 అక్టోబర్ 16న బోస్టన్ లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ లో డాక్టర్ విలియం టి.జి. మోర్టన్ ఈథర్ అనస్థీషియాను తొలిసారిగా విజయవంతంగా ప్రదర్శించిన జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, అనంతపురములోని అనస్థీషియాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం అక్టోబర్ 16న వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనస్థీషియాలజీ విభాగాధిపతి డాక్టర్ నవీన్ మరియు ఇన్-చార్జ్ హెచ్ ఓ డి డాక్టర్ సుబ్రమణ్యం నాయకత్వం వహించగా, అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయశ్రీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సురక్షిత శస్త్రచికిత్సకు సురక్షిత అనస్థీషియా ఎంతో అవసరమని, అనస్థీషియాలజిస్టుల పాత్ర ఆపరేషన్ థియేటర్ కే పరిమితం కాకుండా రోగి ఆసుపత్రికి వచ్చినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు కొనసాగుతుందని ఆమె కొనియాడారు. అందులో భాగంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి మరియు ఇన్-చార్జ్ హెచ్ ఓ డి డాక్టర్ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో పి టీ సి గ్రౌండ్ లో ఉదయం 6:00 నుండి 7:30 గంటల వరకు సామాన్య ప్రజలకు సి పి ఆర్ (గుండె-ఊపిరితిత్తుల పునరుజ్జీవనం) ఎలా చేయాలో ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు. అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడడంలో సి పి ఆర్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎస్.వి. పద్మ, పీజీ విద్యార్థులు, ఇంటర్న్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు