Homeజిల్లాలుఅనంతపురంనార్పలలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరు..

నార్పలలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరు..

- Advertisement -

గోపాల్‌కు సత్యనారాయణ రెడ్డి, జెడ్పీటీసీ శివానందరెడ్డి మద్దతు.. రమాదేవి తరఫున సంజీవరెడ్డి ప్రచారం!

విశాలాంధ్ర – నార్పల:- మేజర్ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నార్పలలో సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. సర్పంచ్ అభ్యర్థి చిలమకూరి చికెన్ గోపాల్‌కు మద్దతుగా నార్పల సత్యనారాయణ రెడ్డి, జెడ్పీటీసీ శివానందరెడ్డి ప్రచారంలో పాల్గొనగా, మరోవైపు స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మొరుసు రమాదేవికి మద్దతుగా ఆమె భర్త మొరుసు సంజీవరెడ్డి సైతం మైనార్టీ వర్గాల ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు.గోపాల్‌కు మద్దతుగా నార్పల సత్యనారాయణ రెడ్డి, జెడ్పీటీసీ శివానందరెడ్డి నార్పలలోని అన్ని మసీదుల వద్దకు వెళ్లి ముస్లిం సోదరులను మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచ్ అభ్యర్థి గోపాల్‌కు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గోపాల్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గోపాల్ సైతం ముస్లిం సోదరులను కలిసి తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ఓట్లు అభ్యర్థించారు.
మరోవైపు స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మొరుసు రమాదేవి తరఫున ఆమె భర్త మొరుసు సంజీవరెడ్డి మైనార్టీ వర్గాల ప్రజలను కలిసి ప్రచారం నిర్వహించారు. తన భార్య రమాదేవికి మద్దతుగా నిలిచి, అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఒకవైపు చిలమకూరి చికెన్ గోపాల్‌కు నాయకుల మద్దతుతో ప్రచారం కొనసాగుతుండగా, మరోవైపు రమాదేవి తరఫున సంజీవరెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో నార్పలలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం మరింత ఆసక్తికరంగా మారింది.ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు