ఎంఈఓ లు రాజేశ్వరి దేవి,గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పదవ తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు డిసెంబర్ 5వ తేదీ వరకు గడువు పొడిగించడం జరిగిందని ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్, డీఈవో ఆదేశాల మేరకు 50 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 6-9 వరకు, 200 ఆలస్య రుసుముతో డిసెంబరు 10-13 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 14-18 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. కావున ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం గమనించి ఈ సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేయాలని తెలిపారు. సకాలంలో చెల్లించే విధంగా కృషి చేయాలని తెలిపారు.
పదోతరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు..
- Advertisement -
RELATED ARTICLES


