విశాలాంధ్ర అనంతపురం: ఆదాని కాపాడడానికి కోసమే మోదీ అమెరికా పర్యటన చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ భావిస్తున్నామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆదాని పై అమెరికా దేశంలో న్యూయార్క్ జిల్లా కోర్టులో కేసు నమోదు చేసిందన్నారు. ప్రపంచంలోనే 6300 కోట్లు పెట్టుబడులు సేకరించి, అమెరికా దేశంలో 15 వందల కోట్లు సేకరించడం జరిగిందన్నారు. భారతదేశంలో ఐదు రాష్ట్రాలలో లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించడంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు ముడుపులు చెల్లించడం జరిగిందన్నారు. అమెరికాలో చట్టాలు ఉన్నాయి కాబట్టి అమెరికాలో పెట్టుబడులు సేకరించినందుకు భారతదేశంలో ముడుపులు చెల్లించినందుకు సాగర్ ఆధాని,ఆదాని 8 మందిపై కేసులు పెట్టడం జరిగిందన్నారు. మోదీ అమెరికాకు పోకముందే . ట్రంప్ వచ్చిన తర్వాత ఈ కేసును సంబంధించి ఆపివేయడం జరిగిందన్నారు. ద్వారా ఆధాని కంపెనీలకు షేర్ వాల్యూ పెరిగిందని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారానికి వచ్చి 11సం అవుతున్నప్పటికీ మొదట్లో నరేంద్ర మోడీ యువతకిచ్చిన వాగ్దానం ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పడం జరిగిందన్నారు. దీని ప్రకారం చూసుకుంటే 11 సంవత్సరాలకు గాను 22 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
నరేంద్ర మోడీ యువతకు ఉపాధి కల్పించినట్లయితే భారతదేశంలో ఉన్న యువత అమెరికాకు వలసల పోయి ఉద్యోగాలు వెతుక్కుంటున్నారన్నారు. ఇటీవల జరిగిన సంఘటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి రాగానే వివిధ దేశ ప్రజలు ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్నారు. భారతదేశ నుంచి ఉద్యోగాల కోసం
అమెరికాకు వెళ్లిన మన యువతను అమెరికా ప్రభుత్వం వెనక్కి పంపించే విధి విధానాల్లో భాగంగా యువతకు చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి ఇండియాకు పంపించినప్పుడు నరేంద్ర మోడీ స్పందించకపోవడం సరికాదన్నారు. స్పందించకపోగా మహా కుంభమేళలో పుణ్య స్థానాలు నిర్వహిస్తున్నారంటే యువత పట్ల ఆయనకున్న ప్రేమ ఎటువంటిదో తెలుస్తోందన్నారు. పుల్వామాల్లో ఉగ్రవాదులు 44 మంది జవాన్లను మట్టు పెడుతుంటే ఏమాత్రం స్పందించకుండా రాజస్థాన్లో చిత్ర పరిశ్రమకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. కొలంబియా, మెక్సికో దేశస్తులు అమెరికాలో ఉంటున్న వారి యువతను కాపాడడం కోసం కమిటీలు వేసి వారికి రక్షణ కల్పిస్తూ వాళ్ల దేశానికి పిలిపించుకున్నారన్నారు. మన దేశ యువత పట్ల ఎటువంటి వైఖరి ఉందో తెలుస్తోందని పేర్కొన్నారు.