Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

అధికారం చేపట్టిన తర్వాత గ్రూపిజం కొనసాగకూడదు

: కేరళ సీఎం
తిరువనంతపురం : ఎన్నికల సమయంలో గ్రూపిజం అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగకూడదని, ప్రజల ప్రయోజనాల పైనే దృష్టి సారించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం తెలిపారు. తన మంత్రివర్గ సహచరులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శిక్షణలో మంత్రులు రోషి అగస్టీన్‌, వి.ఎన్‌.వాసవన్‌, అహ్మద్‌ దేవర్‌కోవిల్‌, పి.ఎ.మహమ్మద్‌ రియాస్‌, పి.రాజీవ్‌, ఎ.కె.శసీంద్రన్‌, డాక్టర్‌ ఆర్‌.బిందు తదితరులు పాల్గొన్నారు. సీఎం విజయన్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చిన తర్వాత, వారికి సహాయం చేసిన వారి పట్ల పక్షపాతంగా ఉండకూడదని, చేయని వారి విషయంలో పక్షపాతంతో వ్యవహరించరాదని అన్నారు. వారు ప్రతి ఒక్కరిని సాధారణ ప్రజలతో సమానంగా పరిగణించాలని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img