Wednesday, February 18, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బేకరీ షాప్ దగ్ధం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బేకరీ షాప్ దగ్ధం

- Advertisement -

20 లక్షలు ఆస్తి నష్టం.. బేకరీ యజమాని అజయ్

విశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల లక్ష్మీ శ్రీ బేకరీ షాపు శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ ఆఫీసర్ ఎం నర్సింలు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అజయ్ అనే బేకరీ షాప్ యజమాని కొన్ని సంవత్సరాలుగా బేకరీ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగించేవాడని, అనుకోకుండా శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా షాపు దగ్ధమైందని తెలిపారు. బాధితుడు అజయ్ తెలిపిన మేరకు 20 లక్షల దాకా నష్టము వాటిలినట్లు ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నైట్ బీట్ చేస్తున్న పోలీసులు మాకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన నాతో పాటు జిల్లా ఫైర్ ఆఫీసర్ మాధవ నాయుడు తదితర సిబ్బందితో అక్కడికి వెళ్లడం జరిగిందన్నారు. షట్టర్ తీయకపోవడంతో జెసిబి సహాయంతో వాటిని తొలగించి మా సిబ్బంది ద్వారా మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. షాప్ లో ఉన్న ఫ్రిడ్జ్, బేకరీ కి సంబంధించిన యంత్రాలు, వాటి పరికరాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం జరిగిందని తెలిపారు. బాధితుడు అజయ్ బేకరీ షాప్ కు ఇన్సూరెన్స్ కూడా చేయలేదని తెలిపారు. తదుపరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. బాధితుడు అజయ్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా నేను బేకరీ షాప్ నడుపుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకునే వాడని తెలిపారు. అనుకోకుండా ఈ ఘటన కావడం వల్ల నేను దాదాపు 20 లక్షల వరకు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కావున నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ముస్తఫా, రవీంద్రనాయక్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు