Friday, January 24, 2025
Homeఆంధ్రప్రదేశ్టిబెట్ - నేపాల్ సరిహద్దులో పెను భూకంపం..32 మంది దుర్మరణం

టిబెట్ – నేపాల్ సరిహద్దులో పెను భూకంపం..32 మంది దుర్మరణం

రిక్టర్ స్కేలుపై 7.1 పాయింట్లుగా నమోదైన తీవ్రత
టిబెట్ లో పెను భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో నేపాల్ – టిబెట్ సరిహద్దుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1 పాయింట్లుగా నమోదైంది. పలు భవనాలు, భారీ వృక్షాలు నేలమట్టం అయ్యాయి. భూకంపం కారణంగా ఇప్పటి వరకు 32 మంది మరణించారని టిబెట్ అధికారవర్గాలు తెలిపాయి. ఈమేరకు చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా వార్తా కథనాలు ప్రసారం చేసింది. భూ ప్రకంపనలు అటు నేపాల్ లో, ఇటు ఇండియాలోని పలు రాష్ట్రాల్లోనూ నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో, బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్ లోనూ భూమి కంపించింది. మంగళవారం ఉదయం వెంటవెంటనే మూడుసార్లు భూమి కంపించిందని, మొదటి భూకంపం తీవ్రత 7.1 పాయింట్లు కాగా ఉదయం 7:02 గంటలకు 4.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించిందని, తర్వాత 5 నిమిషాలకు 4.9 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. భౌగోళిక పరిస్థితులు, భూగర్భంలోని టెక్టానిక్ ప్లేట్స్ కదలికల కారణంగా హిమాలయాల పక్కనే ఉన్న నేపాల్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015లో సంభవించిన పెను భూకంపంలో దాదాపు 9 వేల మంది చనిపోగా, 25 వేల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 5 లక్షలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు