కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి పెద్ద పీట.
— మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.
విశాలాంధ్ర – కడియం : కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం కడియం మండలం బుర్రిలంక గ్రామంలో రూ.205 లక్షల ఎంజిఎన్ఆర్ఇజిఎస్, మండల పరిషత్ నిధులతో బుర్రిలంక కాలువగట్టు నుండి గోదావరి ఏటి గట్టు వరకు నిర్మించిన సిసి రోడ్డును రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చొరవ, పర్యాటక శాఖ సహకారం, నాటి కలెక్టర్ ప్రశాంతి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ రోడ్డును నిర్మించగలిగామన్నారు. ఈ రోడ్డు స్థానిక నర్సరీ రైతులకు, ఎస్సీ సొసైటీ భూములు గల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఆర్ఈజీఎస్, పంచాయితీ రాజ్ నిధులతో లింకు రోడ్లు, గ్రామీణ రోడ్లు నిర్మించుకోవడం నిరంతర ప్రక్రియగా జరుగుతుందన్నారు. 12 దేశాలతో కనెక్టివిటీ చేయగలిగిన ప్రపంచ స్థాయి గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తే, దాన్ని స్వాగతించాల్సింది పోయి విమర్శించడమే జగన్ అండ్ కో బ్యాచ్ పనిగా పెట్టుకున్నారన్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ మండలాన్ని “నో వర్క్” మండలం గా తీర్చిదిద్దడంతో పాటుగా కడియంలో నవోదయ, ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ మారిశెట్టి పద్మావతి, ఉప సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, కూటమి నాయకులు డాక్టర్ గోరంట్ల రవి రాం కిరణ్, వెలుగుబంటి నాని, గట్టి నరసయ్య, గట్టి సుబ్బారావు, బోడపాటి గోపి, బోడపాటి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


