విశాలాంధ్ర- అనంతపురం : భారత కమ్యూనిస్టు పార్టీ 25వ రాష్ట్ర మహాసభల సందర్భంగా సిపిఐ మైనారిటీ విభాగం ఉ ఆల్ ఇండియా తంజీమ్-ఏ-ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ సి. జాఫర్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మైనార్టీస్ (నామ్), యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ (బ జె ఏ సి), ఆల్ ఇండియా తంజీమ్-ఏ-ఇన్సాఫ్ నగర సమితి (ఇన్సఫ్) సంయుక్తంగా ఆదివారం అనంతపురం ప్రెస్ క్లబ్‌లో సన్మాన సభను నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా వివిధ రాజకీయ, సామాజిక, ప్రజా సంఘాల నాయకులు, మైనారిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశానికి ప్రఖ్యాత మైనారిటీ నాయకులు బాబాషా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సి. జాఫర్ మాట్లాడుతూ… దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని, బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టి నివిభజించి పాలించేు విధానాలను కొనసాగిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ సంస్థలు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసే ముట్టు గుంపుల ఆధీనంలోకి వెళ్లడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు ఏర్పడుతోందన్నారు. ప్రతి ఎన్నికల ముందు అల్లర్లు, బాంబు దాడులు జరగడం సహజం కావడం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రజలు ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం నిలబడి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఏ పాత్రలేని బీజేపీఉఆర్‌ఎస్‌ఎస్ ఈ రోజు దేశభక్తిని బోధించడం విచిత్రమని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అవమానించే ధోరణిపెరుగుతోందని విమర్శించారు. ప్రశ్నించే ప్రజలపై దాడులు పెరగడం దేశం ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద ప్రమాదమని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్ ఇండియా తంజీమ్-ఏ-ఇన్సాఫ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బలోపేతం చేస్తూ, పౌర హక్కులు, సామాజిక న్యాయం, మత సహనాన్ని కాపాడేందుకు విస్తృత పోరాటాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి. జగదీష్, సి. మల్లికార్జున, దాదా గాంధీ, జి. సంతోష్ కుమార్, సాకే హరి, లింగమయ్య, అల్లి పిరా, చాంద్ బాషా, మున్నా, రాజు, జానకి, మేహమూదా, యశోదమ్మ, ఖలీల్, జకరియా, జాకీర్ హుస్సేన్, మెహఫిల్ తాజ్, ఐ ఎం ఎం బాషా, టిప్పు జాకీర్, అమ్మా షేక్షా, హాఫిజ్ మహమూద్, ఖాజీ జాహిద్ హుస్సేనీ, డా. మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కామ్రేడ్ సి. జాఫర్ కు ఘన సన్మానం
- Advertisement -
RELATED ARTICLES


