విశాలాంధ్ర-తాడిపత్రి: మండల పరిధిలోని సజ్జలదిన్నె గ్రామం సమీపంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు సిఐ శివగంగాధర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన బండి ఆనంద్ కుమారుడు చరణ్ వయస్సు (20), మద్దిలేటి అనే వ్యక్తులు టూ వీలర్ లో బుగ్గ వైపు నుండి తాడిపత్రి వైపుకు వస్తూ ఉండగా సజలదిన్నె గ్రామ సమీపంలో ఎస్సార్ విలాస్ వద్ద కు రాగానే వారికి ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో టు వీలర్ లో వెళ్తున్న చరణ్ లారీకి వెనక వైపున ఉన్న నెంబర్ ప్లేట్ కి ఢీకొని కింద పడి బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మరణించాడు. మద్దిలేటికీ స్వల్ప గాయాలు అయ్యాయి అని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
- Advertisement -
RELATED ARTICLES


