Thursday, March 13, 2025
Homeజాతీయంయూట్యూబ్‌లో చూసి గోల్డ్ స్మగ్లింగ్ నేర్చుకున్నా.. డీఆర్ఐ విచారణలో నటి రన్యారావు

యూట్యూబ్‌లో చూసి గోల్డ్ స్మగ్లింగ్ నేర్చుకున్నా.. డీఆర్ఐ విచారణలో నటి రన్యారావు

బంగారం ఎవరికీ కనిపించకుండా ఎలా తేవాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానన్న నటి
దుబాయ్ నుంచి అక్రమంగా 14.2 కేజీల బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన నటి రన్యారావు విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. దుబాయ్ నుంచి గతంలో ఎన్నడూ బంగారం తీసుకురాలేదని, ఇదే తొలిసారని ఆమె తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారని, బంగారం ఎవరికీ కనపడకుండా ఎలా దాచాలన్న విషయాన్ని యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానని చెప్పినట్టు సమాచారం. నటి రన్యారావు స్మగ్లింగ్ వ్యవహారం వెనక ాపెద్దలు్ణ ఉన్నట్టు భావిస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఎవరెవరితో సంబంధాలున్నాయన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వివాహానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హోం మంత్రి జి.పరమేశ్వర హాజరైన ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది. కాగా, ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు అన్ని కోణాల నుంచి విచారిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు