Homeజాతీయంనీట్‌ పీజీ 2026 అభ్యర్థులకు అలర్ట్‌.. సెంటర్‌ వివరాల్లో సాంకేతిక సమస్య

నీట్‌ పీజీ 2026 అభ్యర్థులకు అలర్ట్‌.. సెంటర్‌ వివరాల్లో సాంకేతిక సమస్య

- Advertisement -

నీట్‌ పీజీ 2026 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలు తప్పుగా వెళ్లాయి.
సాంకేతిక సమస్య కారణంగానే ఈ పొరపాటు జరిగినట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ బుధవారం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో సరైన పరీక్ష కేంద్ర వివరాలతో అభ్యర్థులకు మరోసారి ఎస్‌ఎంఎస్‌,ఈమెయిల్‌ ద్వారా సమాచారం పంపినట్లు తెలిపింది.
అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాల వివరాలను ఎన్‌బీఈఎంఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు పేర్కొంది.
గతంలో అందిన ఎస్‌ఎంఎస్‌ను ఆధారంగా తీసుకోవద్దని సూచించింది.అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి పరీక్ష కేంద్రానికి సంబంధించిన తాజా వివరాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని స్పష్టం చేసింది.

ఆగస్టు 15 వరకు దరఖాస్తుల సవరణ
అలాగే నకిలీ వెబ్‌సైట్లు, అధికారికం కాని సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని అభ్యర్థులను హెచ్చరించింది.వైద్య విద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌ పీజీ 2026 పరీక్షను ఈ నెల 30న నిర్వహించనున్న విషయం తెలిసిందే. నీట్‌ పీజీ 2026 దరఖాస్తుల్లో ఫొటో, సంతకం, వేలిముద్ర నిబంధనలకు అనుగుణంగా లేని అభ్యర్థులకు చీదీజువీS మరో అవకాశం కల్పించింది. ఈ వివరాల్లో అవసరమైన మార్పులు చేసుకునేందుకు ఆగస్టు 15 రాత్రి 11.55 గంటల వరకు గడువు ఇచ్చింది. నిర్ణీత సమయంలోగా తప్పులను సరిచేయకపోతే సంబంధిత దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉందని బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థులు చీదీజువీS అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్‌ కావాలని సూచించింది.

సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచాలి
అక్కడ అప్‌లోడ్‌ చేసిన ఫొటో, సంతకం, బొటనవేలి ముద్ర ఆమోదం పొందాయో లేదో పరిశీలించుకోవాలని పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని గుర్తిస్తే ఆగస్టు 15లోగా తప్పనిసరిగా సరిచేయాలని తెలిపింది. నీట్‌ పీజీ పరీక్షతో పాటు అనంతరం జరిగే కౌన్సెలింగ్‌, ప్రవేశ ప్రక్రియ పూర్తయ్యే వరకు దరఖాస్తులో నమోదు చేసిన ఈమెయిల్‌ చిరునామా, మొబైల్‌ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలని చీదీజువీS సూచించింది. పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఈమెయిల్‌, మొబైల్‌ ద్వారా ఎప్పటికప్పుడు పంపే అవకాశం ఉన్నందున అభ్యర్థులు వాటిని తరచూ పరిశీలిస్తూ ఉండాలని బోర్డు స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు