జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; ఖైదీలకు అన్ని వసతులు సక్రమంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అనంతపురం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం పట్టణంలోని సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి వారు ఖైదీలు ఉండు గదులను, వంట గదులను, పరిసర ప్రాంతాలను వారు పరిశీలించారు. అనంతరం ఖైదీలతో కాసేపు మాట్లాడుతూ మీకు ఎవరికైనా న్యాయవాదని పెట్టుకునే సోమత లేనియెడల ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని అటువంటి వారు మీ జైలు సూపర్డెంట్ బ్రహ్మారెడ్డికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.మీ సమస్యలు ఏమైనా ఉన్న యెడల నేరుగా గాని, సబ్ జైల్ సూపర్డెంట్ గాని తెలుపవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నూర్ మొహమ్మద్ బాలసుందరి, జైలు సూపర్డెంట్ బ్రహ్మారెడ్డి, జైలు సిబ్బంది,పి ఎల్ వి షామీర్ భాష తదితరులు పాల్గొన్నారు.
ఖైదీలకు అన్ని వసతులు సక్రమంగా ఉండాలి..
RELATED ARTICLES