Thursday, December 12, 2024
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్ర బడ్జెట్ లో చేసిన కేటాయింపులు అంకెల గారడీ

రాష్ట్ర బడ్జెట్ లో చేసిన కేటాయింపులు అంకెల గారడీ

చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు

విశాలాంధ్ర అనంతపురం : బి సి, ఎస్ సి, ఎస్ టి, మైనార్టీ సంక్షేమం పేరుతో రాష్ట్ర బడ్జెట్ లో చేసిన కేటాయిపులు అంకెల గారడీ మాత్రమేనని చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు పేర్కొన్నారు. స్థానిక నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో బుధవారం చేతి వృత్తి దారుల సమాఖ్య ఎపి రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి, రాష్ట్ర కార్యనిర్వాహాక అధ్యక్షులు సి. లింగమయ్య, గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట్ల పోతులయ్య లతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2,94,000లక్షల కోట్ల అంచనా తో 2,41,000లక్షల అంచనా వ్యయం తో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బి సి లకు 39,007కోట్లు, ఎస్ సి లకు 18,497కోట్లు, ఎస్ టి లకు 7,557కోట్లు, మైనార్టీ లకు 4, 376కోట్లు మొత్తం: 69,437కోట్లు బడ్జెట్ లో 3.47%మాత్రమే రాష్ట్ర జనాభా లో 30% వున్న ఈ సామాజిక వర్గాల సంక్షేమము కోసం దేనికి కేటాయిస్తున్నట్లు స్పష్టంగా తెలియజేయలేదు అన్నారు. .జనాభా ప్రాతిపదిక పై వృత్తి దారులకు ఏవిధంగా ఖర్చు చేస్తారో కూడా పొందపరచలేదన్నారు. మా ప్రభుత్వం వెనుక బడిన, దళిత, గిరిజన, మైనార్టీ లకు పెద్ద పీఠ వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వాగ్దానాలకు, ఆచరణకు ఎంతో తేడా ఉంది అన్నారు. ఈ సామాజిక వర్గ చేతి వృత్తి దారులను అంకెలతో మభ్య పెట్టి మోసగించడం తప్ప మరొకటి కాదని విమర్శించారు. ఈ సమావేశం లో చేతి వృత్తి దారుల సమాఖ్య అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి సివి హరికృష్ణ, రజక సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు సి. నాగప్ప, నగర నాయకులు గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు