ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజముద్ర వేయడం చరిత్రాత్మకమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపేందుకు, మంత్రి లోకేశ్ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీల బృందం సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ చారిత్రక నిర్ణయంతో మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-మా రాజధాని అమరావతి అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునేలా చేశారని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి బిల్లుకు రాజముద్ర.. రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎంపీలు
- Advertisement -
RELATED ARTICLES


