Friday, March 6, 2026
Homeఅంతర్జాతీయంఅమెరికా పౌరహక్కుల నేత జెస్సి జాక్సన్ మృతి

అమెరికా పౌరహక్కుల నేత జెస్సి జాక్సన్ మృతి

- Advertisement -


షికాగో : అమెరికాలో మానవ హక్కుల ఉద్యమ నేత రెవరెండ్ జెస్సి ఎల్ జాక్సన్ మంగళవారం మృతి చెందారు. శ్వేత జాతి దొరహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ అనుచరుడు. రెండుసార్లు దేశాధ్యక్ష పదవికి పోటీ చేసిన మానవ హక్కుల ఉద్యమ ప్రముఖుడు జాక్సన్. ఆయనకు 84 సంవత్సరాలు. తన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తుదిశ శ్వాస విడిచారని జక్సన్ కుమార్తె సంతితా జాక్సన్ తెలియజేశారు. హత్యకు గురైన మార్టిన్ లూథర్ కింగ్ కు తానే వారు జాక్సన్ ప్రకటించుకున్నారు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం వారి రాజకీయ ప్రాతినిధ్యం కోసం జీవిత కాలం పోరాడిన నిత్య ఉద్యమకారుడుగా మన్ననలు అందుకున్నారు జాక్సన్. నల్ల జాతీయులకు గౌరవాన్ని సమానత్వాన్ని సాధించడం కోసం కృషిచేసి అనేక సందర్భాల్లో విజయం సాధించారు. “పీడిత, తాడిత వర్గాల సేవకుడు అని, న్యాయం సమానత్వం ప్రేమల సాధన కోసం ఆయన ఎంచుకున్న మార్గం లక్షల మందికి స్ఫూర్తినిచ్చింది ” అని జాక్సన్ కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినా… ప్రదర్శనలు, నిరసనలలో క్రియాశీల కార్యకర్తగా పాల్గొనేవారు. జాక్సన్ సేవలకు గుర్తింపుగా 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన “ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్” ను ఆయనకు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు