ఎన్నికల సంఘంపై మమత ఆరోపణ
కోల్ కతా : ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ మరోసారి విమర్శలు గుప్పించింది. తుగ్లకీయ కమిషన్ల వ్యవహరిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు. భాజపా ఆదేశానుసారం వాటర్ జాబితాలో మార్పులు, చేర్పులు చేస్తుందని విమర్శించారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తోందని, ఢిల్లీ చక్రవర్తి సుల్తాన్ మహమ్మద్ తుగ్లక్, జర్మనీ నియంత హిట్లర్ లా వ్యవహరిస్తూ బెంగాల్ వాటర్ లను యాతనలకు గురిచేస్తుందని విలేకరుల సమావేశంలో అన్నారు. ఈసీ నిబంధనల్ని ఉల్లంఘిస్తోంది, సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తుందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వాటరు నిర్ధారణకు ఆమోదిస్తున్న డాక్యుమెంట్లను పశ్చిమబెంగాల్ లో ఆమోదించడం లేదని ఆమె తెలిపారు. బెంగాల్ భారతదేశంలో భాగం కాదా అని ఆమె ప్రశ్నించారు. ఎస్ ఐ ఆర్ కారణంగా తలెత్తిన మానసికందోళన, పని ఒత్తిడి బెంగాల్లో 160 మరణాలకు కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు.


