Homeఅంతర్జాతీయంట్రంప్‌కి ఊహించని ఎదురు దెబ్బ!

ట్రంప్‌కి ఊహించని ఎదురు దెబ్బ!

- Advertisement -

తల కిందులైన అంచనాలు…
దిక్కు తోచని స్థితిలో అగ్ర రాజ్యం

తెహ్రాన్: ఎలాగైనా ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అమెరికా తలపెట్టింది. అక్కడ వివిధ జాతుల వారిని వాడుకుని ఇరాన్‌ను దెబ్బతీయాలని అగ్రరాజ్యం ఎత్తుగడ వేసింది. కానీ, అవి వికటించడంతో ఎదురుదెబ్బలే మిగిలాయి. తప్ప్పుడు అంచనాల ఫలితంగా తాను సృష్టించిన సంక్షోభంలో తానే చిక్కుకుపోయింది. నష్టాలను తగ్గించుకోవడానికి ఇప్ప్పుడు నానా తంటాలు పడుతోంది. అమెరికా వ్యూహం ఇరాన్‌కే కలిసి వచ్చినట్లైంది. సుప్రీంలీడర్ ఖామేనీ మరణంతో ఇరాన్ విచ్ఛిన్నమవుతుందని అమెరికా భావించింది. స్థానిక అసంతృప్త వర్గాలన్నీ వీధుల్లోకి వస్తాయని, అంతర్గత కలహాలతో ప్రభుత్వాన్ని కూలుస్తాయని భావించింది. అయితే, ఇరాన్ నుంచి ప్రస్తుతం ఎదురవుతోన్న ప్రతిఘటననూ అమెరికా ఊహించలేదు. ముందు అమెరికా, ఇజ్రాయిల్‌లు తమ సొంత సైన్యాలను పంపించాలని తలంచాయి, అది సరైన ఎత్తుగడ కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భూతల యుద్ధం చేయకుండా, ప్రజాందోళనలు లేకుండా ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చడం అంత సులభం కాదు. ఇరాన్ తన మనుగడ కోసం పోరాడుతుండగా, అమెరికా మాత్రం స్వప్రయోజనాలపై తప్ప్పుడు అంచనాలతో తాను తీసుకున్న గోతిలో తానే పడింది. ఇప్ప్పుడు ముందుకూ కదల్లేక, వెనక్కీ వెళ్లలేని సంకటస్థితిలో కూరుకుపోయింది.
బలంగా ఇరాన్ స్థానిక బలగాలు…
ఇరాన్ జనాభాలో కుర్దులు పదిశాతం వరకూ ఉంటారు. వీరు ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు సిరియాలో ఐఎసఐఎస్‌ను తరిమికొట్టడంలో భాగంగా ఐఆర్‌జీసీ సైనికులకు వ్యతిరేకంగా పరోక్ష పోరాటం చేశారు. ఆ అనుభవంతో కుర్దిష్ పెష్మెర్గా (మృత్యుదళం) ఇరాన్ బలగాలకు వ్యతిరేకంగా భూతల యుద్ధం చేసేందుకు సరిహద్దులు దాటేందుకు సిద్ధంగా ఉంది. తుర్కియే, ఇరాన్‌ల మధ్య నలిగిపోయి, తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామనే అసంతృప్తితో ఉన్న కుర్దులు, ఈ దాడుల్లో పాల్గొంటే తమకు భారీ ప్రతిఫలం దక్కుతుందని ఆశిస్తున్నారు. కుర్దుల తరవాత ఇరాన్‌పై పోరాడేందుకు బలూచ్‌లను వాడుకోవాలని అమెరికా యోచిస్తోంది. అయితే, ఇరాన్‌పై భూతల దాడుల కోసం బలూచ్‌లు లేదా కుర్దులను రంగంలోకి దింపితే ఆ ప్రాంతమంతా గందరగోళం చెలరేగిపోయే ప్రమాదం ఉంది. అఫ్గానిస్థాన్ యుద్ధంలో అమెరికా ఇలాగే అక్కడి రెండో ప్రధాన వర్గమైన హజారస్‌కు శిక్షణ ఇచ్చి తాలిబన్లకు వ్యతిరేకంగా ఉసిగొల్పింది. వారు ఇరవై ఏళ్లకుపైగా పరస్పరం దాడులు చేసుకున్నారు. చివరికి అమెరికా వెనుదిరిగాక అస్థిరమైన శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఒకప్ప్పుడు తాను ఉగ్రవాదులుగా ముద్రవేసిన తాలిబన్లతోనే అమెరికా ఒప్పందం చేసుకుని, పాలనను వారికి అప్పగించింది. అదేవిధంగా, ఇరాన్ ప్రభుత్వం తన బలగాల్లో ఎక్కువ మందిని స్థానికంగా ఉన్న రెండు ప్రధాన మత కేంద్రాల నుంచి చేర్చుకుంటుంది. మతసంస్థలకు నిధులు సమకూర్చే వాణిజ్య వర్గాల్లో ఇరాన్ ప్రభుత్వం బలమైన పట్టును కొనసాగిస్తుంది. కాబట్టి స్థానిక భూభాగాలపై గట్టి పట్టు ఉన్న కుర్దిష్‌లు రంగంలోకి దిగినా భూతల పోరాటం అంత తేలికేమీ కాదు. తెహ్రాన్‌లోని సుప్రీం లీడర్‌ను హతమారిస్తే నాయకత్వ శూన్యత ఏర్పడుతుందని, తత్ఫలితంగా ఇరాన్ బలహీనపడితే, తమ అజెండాకు మద్దతు ఇచ్చే విభిన్న జాతుల జోక్యంతో పరిస్థితులు సామూహిక తిరుగుబాటుకు దారితీస్తాయని అగ్రరాజ్య భావన నిజం కాలేదు. అప్పటిదాకా ప్రజాదరణ కొరవడిన ఇరాన్ ప్రభుత్వం, యుద్ధం కారణంగా ప్రజల మద్దతును సంపాదించుకోగలిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు