ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్ పరీక్షను ఒక రోజు వాయిదా వేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు ఏపీ 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంగ్లీష్ పరీక్ష 21కి వాయిదా
ప్రారంభంలో విడుదల చేసిన టైమ్‌టేబుల్ ప్రకారం ఇంగ్లిష్ పరీక్ష మార్చి 20న జరగాల్సి ఉండగా, ఇప్పుడు దానిని మార్చి 21కు మార్చారు.మిగతా పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఈ స్వల్ప మార్పుతో విద్యార్థులు గందరగోళానికి లోనవద్దని, సవరించిన షెడ్యూల్‌ను గమనించి సిద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది.


