Homeఆంధ్రప్రదేశ్నేడే ఏపీ బడ్జెట్‌.. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

నేడే ఏపీ బడ్జెట్‌.. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

- Advertisement -

ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్‌ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగుల పెట్టించాలనే సంకల్పం లాంటిదని పేర్కొన్నారు.

బడ్జెట్‌ స్వరూపం..
రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌
రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు
మూలధన వ్యయం రూ.53,915 కోట్లు
రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు
ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు


బడ్జెట్‌ ముఖ్యాంశాలు..
రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు
విద్యుత్‌ రంగానికి రూ.13,934 కోట్లు
రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు
పరిశ్రమలకు రూ.3,161 కోట్లు
సర్దుబాటు నిధి.. రూ.1,500 కోట్లు
వీబీ జీ రామ్‌ జీకి.. రూ.8365 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు
ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ.4000 కోట్లు
జల్‌ జీవన్‌కు రూ.4,000 కోట్లు
స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.1,037 కోట్లు
విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు.. ఈ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు
9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం
రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు రూ.30,000 కోట్లు
ప్రతి జిల్లాకు ప్రత్యేక సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌
పాఠశాల విద్యాశాఖ- రూ.32,308 కోట్లు
పంచాయతీరాజ్‌- రూ.22,942 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలు- రూ.13,598 కోట్లు
అన్నదాత సుఖీభవ- రూ.6,660 కోట్లు
పోలవరం- రూ.6,105 కోట్లు
హోంశాఖ- రూ.9,165 కోట్లు
మున్సిపల్‌ శాఖ-రూ.14,539 కోట్లు
జలవనరుల శాఖ రూ.18,224 కోట్లు
హాస్టళ్లు, గురుకులాలకు రూ.300 కోట్లు
విద్యార్థులకు ఉపకారవేతనాలకు రూ.3,836 కోట్లు
మధ్యాహ్న భోజన పథకం.. రూ.2,161 కోట్లు
ఎన్టీఆర్‌ భరోసా.. రూ.27,719 కోట్లు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు