Homeజిల్లాలుఅనంతపురంపెన్నహోబిలం ఆలయ పాలకమండలి చైర్మన్ గా రేగాటి నాగరాజు ?

పెన్నహోబిలం ఆలయ పాలకమండలి చైర్మన్ గా రేగాటి నాగరాజు ?

- Advertisement -

పెన్నహోబిలం ఆలయ పాలకమండలి సభ్యులు నియామకం

విశాలాంధ్ర-ఉరవకొండ అనంతపురం: అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ పాలక మండలి ( ట్రస్ట్) సభ్యులను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శుక్రవారం ప్రకటించింది. అయితే ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామానికి చెందిన టిడిపి పార్టీ సీనియర్ నాయకులు రేగాటి నాగరాజు పేరును ఆలయ చైర్మన్ గా టిడిపి పార్టీ పెద్దలు ఇప్పటికే ప్రకటించారు. అయితే అధికారికంగా సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంది. దేవదాయ శాఖ కమిషనర్ ప్రకటించిన సభ్యుల పేర్లు రేగటి నాగరాజు, అమల దిన్నె చంద్రమౌళి, ధనుంజయ ఆచారి, బొల్లినేని పద్మాక్షి, మంగలి చిన్న నారాయణప్ప, బోయ ఎర్రమ్మ, దబ్బర మాధవి, కురబ ఇందిరమ్మ, రామకృష్ణ, రాములమ్మ, చావాలి భాయ్ పేర్లు ప్రకటించారు. ఈ పాలకవర్గంలో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకా నాతాచార్యులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు