– డి ఎల్ ఏ టి ఓ డాక్టర్ జయలక్ష్మి
విశాలాంధ్ర అనంతపురం టౌన్:
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు (గాంధీ వర్ధంతి సందర్భంగా కుష్టు వ్యాధి పై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగించడం కోసం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు 15 రోజులు పాటు విజయవంతంగా స్పర్శ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా శుక్రవారం కూడేరు పరిధిలోని బ్రాహ్మణపల్లి లెప్రసీ కాలనీ నందు కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కుష్టు మరియు ఎయిడ్స్ టీ బి నియంత్రణ అధికారి డాక్టర్ జయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ఉషారాణి, పీఎంఓ నాగన్న, ఫిజియోథెరపిస్ట్ రాముడు, రిటైర్డ్ హెచ్ ఈవో లు శివ శంకర్ రావు, దేవప్రసాద్ డిపిఎమ్ఓస్ రామదాసు, తిప్పేస్వామి,మరియదాసు ఐసిడిఎస్ సూపర్వైజర్ సురేఖ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


