మోదీ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం..
ఏపీ చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, మోదీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతికటించాలని ఏపీ చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు తెలిపారు. ఈ సందర్భంగా
పట్టణంలో స్థానిక ఎన్జీవోస్ నందు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులు పిలుపునిచ్చారు. మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎజెండాను మరింత నిర్దాక్షిణ్యంగా అమలు జరుపూతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి నాలుగు కార్మిక కోడ్ అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తద్వారా కార్మిక ఉద్యమం పోరాడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులను రద్దు చేయాలని భావించడం జరిగిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని సుప్రీంకోర్టు తీర్పుని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శ క అన్నిటిని భూస్థాపితం చేయాలని సంకల్పించారు అని తెలిపారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చాలనుకున్నారు. ఈ నాలుగు లేబర్ కోర్టుల అమలు ప్రాథమిక హక్కుల సవాలుగా మారుతున్నది అని తెలిపారు .కార్మిక కోడ్ లను అమలుకు వస్తే ఎనిమిది గంటల పని దినం, కనీస వేతనాలు సామాజిక భద్రత సంఘం పెట్టుకున్న హక్కులు సంఘాల రిజిస్ట్రేషన్లు సంఘాల గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, పట్టణ సహాయ కార్యదర్శి రమణ, శ్రీనివాసులు, చేనేత జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, చెన్నంపల్లి శ్రీనివాసులు మీటర్ రీడర్స్ అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్, దస్తగిరి, ఎలక్ట్రానిక్ ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోవిందరాజులు, లక్ష్మీనారాయణ, తాజ్, ఆంజనేయులు, సుబ్బు, రామకృష్ణ, చిన్న, జనార్ధన్, సురేంద్ర, మహిళా సమైక్య లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ, సకల రాజా తదితరులు పాల్గొన్నారు.