Homeఆంధ్రప్రదేశ్పదో తరగతి విద్యార్థులకు 7 మార్కులు కలపాలని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయం

పదో తరగతి విద్యార్థులకు 7 మార్కులు కలపాలని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఊరటనిచ్చేలా అదనపు మార్కుల కేటాయింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాల్లో దొర్లిన సాంకేతిక పొరపాట్లు, అస్పష్టంగా ఉన్న ప్రశ్నల వల్ల విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఎస్ఎస్‌సీ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.బోర్డు నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం, హిందీ సబ్జెక్టులో సందిగ్ధంగా ఉన్న ప్రశ్నల కారణంగా 2 మార్కులు, ఇంగ్లిష్ సబ్జెక్టులో తలెత్తిన లోపాల వల్ల 5 మార్కులు.. మొత్తంగా 7 మార్కులను అదనంగా కలపనున్నారు. ప్రశ్నలు స్పష్టంగా లేని చోట వాటిని అటెంప్ట్ చేసిన విద్యార్థులందరికీ ఈ మార్కులు లభిస్తాయి. ఇది విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగడమే కాకుండా, మెరుగైన గ్రేడింగ్ సాధించడానికి దోహదపడనుంది. అయితే, మరో మూడు ప్రశ్నలపై తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, వాటిలో ఎలాంటి తప్పులు లేవని బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే డీఈవోలకు, మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు ఈ అదనపు మార్కుల కేటాయింపుపై బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు