విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గ పరిధిలోని బత్తలపల్లి మండలంలోని జిఎస్ఐ నెంబర్ ఎస్ ఎస్/ఏ 4 షాపుకు, ముదిగుబ్బ మండలంలోని జి ఎస్ ఐ నెంబర్ ఎస్ ఎస్/18 ఏ 4 మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోవాలని ధర్మవరం ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ దరఖాస్తు రుసుము కింద రెండు లక్షల రూపాయలు డిడి తీసి ఆధార్ కార్డు జత చేసి ధర్మవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో గాని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈనెల 12వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో లక్కీ డ్రా తీయడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోండి.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి
- Advertisement -
RELATED ARTICLES


