శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం; రోగులకు సేవ చేయుటలోనే సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని 200 మంది రోగులకు పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను ఆసుపత్రిలోని వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా అందజేశారు. నేటి ఈ కార్యక్రమానికి సాయి సేవ (దాతగా) లో బి కే తులసమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వహిస్తున్న సేవలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తాయని, ఈ సేవా కార్యక్రమం రోగులకు వరం లాగా మారిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.రైళ్లలో ప్రయాణించే పుట్టపర్తి భక్తాదులకు భోజనం పంపిణీ.. శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులు.;;;;పట్టణంలోని రైల్వే స్టేషన్లో ప్రశాంతి నిలయము నుండి విశాఖ జిల్లా పాడేరు పోవుటకు సేవాదళ్ సభ్యులు 60 మందికి భోజన వసతిని (కొండవీడు ఎక్స్ప్రెస్) కల్పించడం జరిగిందని శ్రీ సత్య సాయి సేవా సమితి 2 నిర్వాహకులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి బాబా ఆశీస్సులతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడంలోనే ఎంతో సంతృప్తి సంతోషం ఉందని వారు తెలిపారు. అనంతరం రైల్వే స్టేషన్ మాస్టర్ నరస నాయుడు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి నిర్వహిస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. అనంతరం రైల్వే స్టేషన్ తరఫున కృతజ్ఞతలను తెలియజేశారు.
రోగులకు సేవ చేయుట లోనే సంతృప్తి ఉంది
- Advertisement -
RELATED ARTICLES


