Homeజిల్లాలుఅనంతపురంకురుబల విజ్ఞాపనలకు సీఎం ఆమోదం.. భక్త కనకదాస జయంతి సభలో మంత్రి సవిత

కురుబల విజ్ఞాపనలకు సీఎం ఆమోదం.. భక్త కనకదాస జయంతి సభలో మంత్రి సవిత

- Advertisement -

త్వరలో బీసీలకు ఆదరణ–3 పథకం అమలు..

విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి బీసీలంతా అండగా నిలవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి సభలో మంత్రి సవిత మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ స్పూర్తితో బీసీల పక్షపాతిగా పనిచేస్తున్న మంత్రి లోకేష్ కు అభినందనలు. కురుబ కులం నీతి, నిజాయతీకి మారని . లోకేష్ పాదయాత్రలో బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారన్నారు. రాయలసీమలో అధికంగా ఉన్న కురుబ కులస్తులను గుర్తించి కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహించడం, విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ వంటి వారన్నారు. గుడికట్ల పూజారులకు గౌరవవేతనం ఇవ్వడం హర్షణీయమన్నారు . గొర్రెల ఇన్సూరెన్స్ పై చంద్రబాబు, లోకేష్ చర్చిస్తున్నారన్నారని, త్వరలో ఇన్సూరెన్స్ ప్రకటించబోతున్నారన్నారు . ఆదరణ-1, ఆదరణ-2 తెచ్చింది చంద్రబాబు గారు, ఆదరణ – 3 తెచ్చేది కూడా చంద్రబాబు గారే అని తెలిపారు. ఇటీవల కార్పోరేషన్ల బాధ్యులతో చర్చించమన్నారు. ఫెన్సింగ్, ఎల్ ఈడీ లైట్లు, గొర్రెల ఉన్ని కటింగ్ మిషన్లు అడిగితే ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఆమోదించారని అన్నారు. చంద్రబాబు కురుబలకు పెద్దపీట వేశారని, తనకు బీసీ వెల్ఫేర్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు