కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు తుంపర్తి పరమేష్
విశాలాంధ్ర ధర్మవరం : దేశంలో బిజెపి పార్టీ అరాచక పాలన కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ నేటి బిజెపి పార్టీ అక్రమ ఓట్లతో అధికారం చేపట్టి అరాచక పాలన కొనసాగించడం దారుణమన్నారు. భారతదేశంలో శాశ్వతమైన సంస్కరణల కోసం ,ప్రజల కోసం ,దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని వారు గుర్తు చేశారు. మరి బిజెపిపార్టీ దేశ ప్రజలను మోసం చేస్తూ ఓట్ల దొంగతనానికి పాల్పడం వాస్తవం కాదా అని వారు ప్రశ్నించారు. బిజెపి అక్రమ ఓట్లతో గద్దెనికి రాహుల్ గాంధీని విమర్శించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అసలు బిజెపి నాయకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఎక్కడ? ప్రజలకు వివరించాలని తెలిపారు. మతాల పేరుతో అరాచకాలు చేస్తున్న బిజెపి రాజ్యాంగ ఏతర శక్తిగా ఎదగాలని చూడడం సరైన పద్ధతి కాదు అని తెలిపారు. 2029లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా బిజెపి చేస్తున్న అక్రమాలు, మోసాలు, దౌర్జన్యాలు, దాడులపై తాము నిరంతర పోరాటాలు సల్ఫీ ప్రజలకు వాస్తవాలు తెలుపుతామని తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో బిజెపి దొంగ ఓట్లతో అధికారం చేయించుకోవడం నిజం కాదా? అని వారు స్పష్టం చేశారు. ఇందుకు వివరణ ఇవ్వాల్సిన అవసరం బిజెపి నాయకులకు ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలిం దాదా పీర్ ,రాజు, గణేష్ ,భాష, అమీర్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో బిజెపి అరాచక పాలన కొనసాగిస్తోంది..
- Advertisement -
RELATED ARTICLES


